

దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ సినిమాలను చూసే అవకాశం మళ్లీ రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రముఖ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ఉన్న స్థలంలో ఏఎంబీ విక్టరీ సినిమాస్ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్, నటుడు మహేశ్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్లు ఉండనున్నాయి. ఒక ఐమ్యాక్స్ విత్ లేజర్ స్క్రీన్, ఒక 4డీఎక్స్ స్క్రీన్‌తో పాటు మరో ఐదు సాధారణ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 18, 2026న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఐమ్యాక్స్ విత్ లేజర్ టెక్నాలజీతో 4కే చిత్రాలు, మెరుగైన రంగులు, స్పష్టమైన విజువల్స్, శక్తివంతమైన ఆడియోను అందించనున్నారు. ముఖ్యంగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలను చూసేందుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ థియేటర్లో మొదటగా 'డ్యూన్: పార్ట్ త్రీ' ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హకీంపేటలోనూ ఏఎంబీ సినిమాస్ ద్వారా 1.43:1 ఫార్మాట్లో ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!