
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్-ఇటలీ మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. ఇటీవల రోమ్‌లో మోదీని కలవడం ఆనందంగా ఉందని, ఇరుదేశాల ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా కలిసి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
అమెరికా రాయబారి సెర్గియో గోర్ మోదీ సాధించిన ఈ ఘనతను ఆయన దశాబ్దాల ప్రజాసేవకు నిదర్శనంగా అభివర్ణించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ, భారత అభివృద్ధి, శ్రేయస్సు మరియు ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠను పెంచడంలో ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!