
సినిమాలు

జంతర్ మంతర్ వద్ద జరిగిన లాఠీచార్జ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. జులై 20న జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండు వారాల్లో సవివర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ సమయంలో అందించిన వైద్య సహాయం, తీసుకున్న చర్యలు, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. అదనంగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!