
జనరల్

దేశంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26 న కేరళను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. సాధారణంగా వచ్చే నెల 1 నాటికి రుతుపవనాలు వస్తుంటాయి కానీ ఈసారి ఐదు రోజుల ముందే రానున్నాయి.
భారతదేశ వ్యవసాయ భూమిలో సగానికి పైగా వర్షపాతంపైనే ఆధారపడి ఉంటుంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 40 శాతం ఈ వర్షాధార సాగు నుంచే వస్తుంది. అందుకే నైరుతి రుతుపవనాలు దేశ ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకంగా ఉంటాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!