
క్రీడలు

వీసీకే చీఫ్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నప్పటికీ క్యాబినెట్ పదవులు మాత్రం తీసుకోమని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వంలో భాగం కాబోమని, వెలుపలి నుంచే మద్దతు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వంలో చేరుతామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని కూడా స్పష్టం చేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకుండా ఉండేందుకే టీవీకేకు మద్దతు ఇచ్చామని ఆయన వివరించారు. ఇప్పటికే వామపక్షాలు కూడా మంత్రి పదవులు తీసుకోబోమని ప్రకటించిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!