11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

Writer: Pooja 09:44 PM, 11 నవంబర్, 2026
విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నాణ్యమైన విద్యను అందించి, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత విధానం ప్రకారం నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్యగా, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించాలని సూచించారు. 12వ తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థులు భాషా, సమాచార నైపుణ్యాల్లో పట్టు సాధించాలని, ఆ తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని వాటిలో నైపుణ్యం పెంచుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు.

10వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేస్తున్నారని, వారిలో బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 12వ తరగతి వరకు విద్య అందించే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో డ్రాపౌట్ల సంఖ్య తక్కువగా ఉంటోందని గుర్తుచేశారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నామని, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగకుండా అవసరమైన సదుపాయాలతో శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, CURE పరిధిలోని పాఠశాలల నిర్మాణ పురోగతిని సమీక్షించి అవసరమైన చోట పనులు చేపట్టాలని సూచించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) అప్‌గ్రేడ్ చేయడం వల్ల విద్యార్థుల నమోదు, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. పాలిటెక్నిక్‌ల ఆధునికీకరణకు నిధుల విడుదలను వేగవంతం చేయాలని, యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామకాలను నిబంధనల ప్రకారం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

అయోడిన్‌ బిళ్లల పంపిణీ వార్తలను ఖండించిన ఇరాన్‌

అయోడిన్‌ బిళ్లల పంపిణీ వార్తలను ఖండించిన ఇరాన్‌

ట్యాగ్లు
తెలంగాణ విద్యా సంస్కరణలురేవంత్ రెడ్డి12వ తరగతి విద్యకొత్త విద్యా విధానంరెసిడెన్షియల్ పాఠశాలలుయూనివర్సిటీ నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!