

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన కొత్త ఆరోగ్య పర్యవేక్షణ పరికరం 'టెంపుల్'పై విమర్శలు చేస్తున్న వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పారు. దేశంలోని వైద్యులందరినీ ఒకే గాటన కట్టడం తన తప్పేనని అంగీకరించారు. తన విమర్శలు మొత్తం వైద్య సమాజంపై కాదని స్పష్టం చేశారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన ఈ వివరణ ఇచ్చారు.
దీపిందర్ గోయల్ ఇటీవల 'టెంపుల్' పేరుతో ఓ హెల్త్ ట్రాకింగ్ పరికరాన్ని పరిచయం చేశారు. నుదిటిపై అమర్చుకునే ఈ పరికరం లైట్ సెన్సర్ల సాయంతో మెదడులో రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయులు, శరీరంపై పడుతున్న శారీరక ఒత్తిడికి సంబంధించిన సంకేతాలను పర్యవేక్షించగలదని సంస్థ చెబుతోంది. అయితే ఈ పరికరం నిజంగా మెదడులో రక్తప్రసరణను కొలవగలదా? దాని ద్వారా వచ్చే వివరాలకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? అంటూ పలువురు వైద్య నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పరికరం ధరను రూ.85,000గా నిర్ణయించడంపై విమర్శలు చేశారు.
వైద్యుల విమర్శలపై నవంబర్ 5న దీపిందర్ గోయల్ ఎక్స్‌లో ఏడు అంశాలతో సుదీర్ఘ పోస్టు పెట్టారు. టెంపుల్ ఒక మోసపూరిత ఉత్పత్తి అయితే దాన్ని ఉపయోగించిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు విషయం అర్థమవుతుందని అన్నారు. ఎటర్నల్ సీఈఓ పదవిని వదిలి టెంపుల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం డబ్బు కోసం కాదని, ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టానని చెప్పారు. తన వివరణతో విమర్శకులు సంతృప్తి చెందకపోతే ఇంకా కోపంతో విమర్శిస్తూనే ఉండొచ్చన్నారు. అలాగే తామే ఎంతో ఉన్నతులమని భావించే భారతీయ వైద్యులు తన పోస్టును పట్టించుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!