

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 7న ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. అనంతరం స్టాళ్లను సందర్శించి, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్ 8న ఉదయం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. హకీంపేట, బొంరాస్‌పేట, కొడంగల్, దుద్యాల, కోస్గి, దౌల్తాబాద్ ప్రాంతాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయం, సమీకృత మండల కార్యాలయం, సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్–2కు శంకుస్థాపన చేస్తారు. నవంబర్ 8న కూడా కొడంగల్‌లోనే బస చేయనున్న సీఎం.. నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో మొత్తం సుమారు రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!