

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రం ‘ఇంజి వెల్లం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. మణిరత్నం గత చిత్రం ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆయన తదుపరి ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా ప్రకటన ప్రకారం, ‘ఇంజి వెల్లం’ 2027 జనవరి 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం కథానాయకుడి కుటుంబాన్ని పరిచయం చేసే అందమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. కోల్‌కతా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమకథతో పాటు భావోద్వేగ అంశాలను కూడా కలిగి ఉండనుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మణిరత్నం కేవలం మూడు నెలల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం సినీ పరిశ్రమలో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మద్రాస్ టాకీస్ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఇండియా టాకీస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి, సాయిపల్లవి తొలిసారిగా మణిరత్నం దర్శకత్వంలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. 2027 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!