

హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామమని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నగరంలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులను పరిరక్షించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అనేక జలవనరులు మురికి కూపాలుగా మారిపోయాయని, అలాంటి చెరువులను గుర్తించి వాటికి పూర్వవైభవం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ చర్యలు నగర పర్యావరణాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లోని సహజ జలవనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణ వల్ల నగర ప్రజలకు ప్రయోజనం కలగడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!