
జనరల్

ప్రముఖ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే డోనా పౌలాలోని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కొంతసేపు చికిత్స చేసి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తన విలక్షణమైన నటన, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నానా పటేకర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆకస్మిక మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరణానికి సంబంధించిన వైద్య, చట్టపరమైన అంశాలను నిర్ధారించేందుకు మెడికో-లీగల్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టుమార్టం అనంతరం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!