
క్రీడలు

ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించగా, అధికారులు శేషవస్త్రంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మహామండపం మొదటి అంతస్తులో జరిగిన ఓ ప్రైవేటు వేడుకకు మంత్రి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!