
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేయడంతో సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆధారాలు సేకరిస్తున్నామని, దీంతో నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయని తెలిపారు. పోక్సో కేసుల్లో నిందితులకు మూడు నెలల్లోనే శిక్షలు పడుతున్నాయని మంత్రి అనిత వెల్లడించారు. అలాగే కాణిపాకం ఆలయంలో భక్తుల భద్రత కోసం 190 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, వాటిని త్వరలో ఏఐ టెక్నాలజీతో అనుసంధానించనున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!