21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

Writer: Harika S 04:15 PM, 21 ఆగస్టు, 2026
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధమవుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డా. ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఎల్‌నినోను కేవలం విపత్తుగా చూడకుండా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కొని, గ్రామాల అభివృద్ధికి అవకాశంగా మలుచుకోవాలని మంత్రులు సూచించారు.

గ్రామస్థాయిలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, తక్షణ అవసరాలతో పాటు వచ్చే ఐదు, పది సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను ఎంపిక చేయాలని సూచించారు.

వీబీ-జీ రామ్‌జీ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఉపాధి హామీ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని మంత్రులు తెలిపారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊట కుంట వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయం, చేపల పెంపకానికి కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభల నుంచే రూపొందాలని, ప్రతి పనికి జియో ట్యాగింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే బహుళ ప్రయోజన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
ట్యాగ్లు
తెలంగాణఎల్‌నినోతుమ్మల నాగేశ్వరరావుసీతక్కవాకిటి శ్రీహరిగ్రామీణాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!