

రెబల్ స్టార్ ప్రభాస్, నటుడు ప్రభాస్ శ్రీను మధ్య స్నేహబంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను, ప్రభాస్‌తో జరిగిన సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘అడవి రాముడు’ సినిమా షూటింగ్ కోసం అడవికి సమీపంలో భారీ సెట్ ఏర్పాటు చేశారని, హీరో, హీరోయిన్, టెక్నీషియన్లు, నటీనటుల కోసం అక్కడే బస ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఓ రోజు అర్ధరాత్రి ప్రభాస్‌కు నాటుకోడి కూర తినాలని అనిపించిందని చెప్పారు.
అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కూర ఎక్కడి నుంచి తీసుకురావాలో తొలుత అర్థం కాలేదని ప్రభాస్ శ్రీను తెలిపారు. అయితే షూటింగ్ కోసం కొన్ని నాటుకోళ్లను తీసుకొచ్చిన విషయం గుర్తుకు రావడంతో వాటిని వెతికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అనంతరం అర్ధరాత్రి టార్చ్ లైట్ పట్టుకుని వెళ్లి కోళ్లను తీసుకొచ్చి, అదే రాత్రి వండి ప్రభాస్‌కు వడ్డించానని వెల్లడించారు. ‘అడవి రాముడు’ షూటింగ్ సమయంలో జరిగిన ఈ సరదా సంఘటనను ప్రభాస్ శ్రీను తాజాగా పంచుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!