

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుందన్‌బాగ్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగునీటి సంస్థల రుణభారాన్ని తగ్గించి తక్కువ వడ్డీతో నిధులను సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఫండింగ్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌పై పూర్తిగా ఆధారపడకుండా స్థిరమైన ఆదాయ వనరులను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సాగునీటి శాఖకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతులపై ఎలాంటి అదనపు భారం లేకుండా కొత్త ఆదాయ మార్గాలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న చట్టబద్ధ ఆడిట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అధిక వడ్డీ రుణాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని, ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, నిధులు, పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, శాఖకు చెందిన భూములు, ఆస్తుల వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేయాలని, భూసేకరణ పరిహారాన్ని రైతులకు ఆలస్యం లేకుండా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!