

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వింటర్ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
మంటలను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ, అవి వేగంగా వ్యాపించడంతో సుమారు ఐదు నిమిషాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికులు, డ్రైవర్, ముగ్గురు అసిస్టెంట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పెద్దవడుగూరు పోలీసులు పరిశీలన చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!