

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘ఏషనాగుల’ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పాట విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి అత్యంత వేగంగా చేరుకున్న పాటగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా యూట్యూబ్ గ్లోబల్ చార్టుల్లోనూ ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్‌కు శ్యామ్ కాసర్ల సాహిత్యం, జాంగిరెడ్డి, ప్రభ గానం మరింత ఊపునిచ్చాయి. నాని, కీర్తి సురేశ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!