

ఒక సినిమా సన్నివేశాన్ని మరింత సహజంగా చూపించేందుకు నటుడు రణ్‌వీర్ సింగ్ ఒకసారి తీవ్ర సాహసానికి ఒడిగట్టినట్లు దర్శకుడు అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఈ ఘటన 2013లో విడుదలైన ‘లూటెరా’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ సన్నివేశంలో రణ్‌వీర్ పాత్రపై కాల్పులు జరుగుతాయి. ఆ సమయంలో కలిగే శారీరక నొప్పిని స్వయంగా అనుభవిస్తే తెరపై మరింత సహజంగా నటించవచ్చని రణ్‌వీర్ భావించాడని అనురాగ్ కశ్యప్ గుర్తు చేసుకున్నారు. ‘మిస్ మాలిని’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
సెట్స్‌లో ఎవరికీ చెప్పకుండా రణ్‌వీర్ ఒక క్లిప్‌ను తీసుకుని తన పొట్టపై గట్టిగా ఒత్తినట్లు అనురాగ్ తెలిపారు. తనకు కలుగుతున్న ఇబ్బందిని రణ్‌వీర్ బయటపెట్టకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారే వరకు ఎవరికీ విషయం తెలియలేదని చెప్పారు. చివరకు అతడు కదలలేని స్థితికి చేరుకోవడంతో చిత్ర బృందం హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒకే ఒక్క సన్నివేశం కోసం రణ్‌వీర్ ఇంతటి ప్రమాదకర ప్రయత్నం చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!