
టెక్నాలజీ

విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆధార్ సేవా కేంద్రానికి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు తమ నమోదిత ఈమెయిల్ వివరాలను సులభంగా నవీకరించుకోవచ్చు.
ఈ ఉచిత సేవ జూలై 1 నుంచి ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది. ప్రజలు తమ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడానికి, సేవల్లో పారదర్శకతను పెంచడానికి మరియు ఆధార్ ఆధారిత సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!