

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ టీవీకే విజయం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వినియోగం వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తంజావూర్లో జరిగిన వివాహ వేడుకలో ఆయన మాట్లాడుతూ, డీఎంకే గెలుపు-ఓటమిని సమానంగా చూస్తూ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని తెలిపారు.
డీఎంకే ఓడిపోయిందని పార్టీ పనైపోయిందని కొందరు చెబుతున్నారని, కానీ డీఎంకే ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేస్తుందని ఆయన అన్నారు. పార్టీ ఎన్నో ఎన్నికలు ఎదుర్కొని మళ్లీ బలంగా నిలిచిందని, తమ పాలన కొనసాగుతుందని తెలిపారు.
టీవీకే బూత్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు లేకుండానే గెలిచిందని, వారి విజయానికి సోషల్ మీడియానే కారణమని స్టాలిన్ ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడును రాబోయే ప్రమాదాల నుంచి రక్షిస్తామని, ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ నిజ స్వరూపాన్ని గుర్తిస్తున్నారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!