
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పాటు దాదాపు 60 దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రేడ్ యాక్ట్–1974లోని సెక్షన్ 301 ప్రకారం ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.
అయితే వెట్టి చాకిరీ (Forced Labour) నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేసిన నేపథ్యంలో భారత ఉత్పత్తులపై విధించే సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్లు సమాచారం. దీంతో భారత ఎగుమతిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!