11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

Writer: Chandrika 05:53 AM, 11 ఆగస్టు, 2026
నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

మేషం: మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కీలక విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ప్రయోజనకరం. శ్రీశివపార్వతుల ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.

వృషభం: నేడు శుభఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన కొనుగోళ్ల ద్వారా లాభాలు పొందవచ్చు. మీ రంగంలో ఆదరణతో పాటు అభిమానులు పెరుగుతారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం: చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా తోటివారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. అవసరమైన సమయంలో సహాయం అందుతుంది. ఇష్టదేవతా శ్లోకాల పఠనం శుభప్రదంగా ఉంటుంది.

కర్కాటకం: మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఉన్నప్పటికీ ఆరోగ్యం, శారీరక అలసట విషయంలో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

సింహం: వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. గౌరవ సన్మానాలు దక్కవచ్చు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. సూర్యధ్యానం శ్రేయస్కరం.

కన్య: మనఃశ్శాంతి, సౌఖ్యం లభిస్తాయి. వ్యాపారంలో శుభఫలితాలు, ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దుర్గా స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.

తుల: మానసికంగా దృఢంగా ఉండి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత అవసరం. శివ అష్టోత్తర శతనామావళి పఠనం శుభప్రదం.

వృశ్చికం: మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు: ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు. శని ధ్యానం శ్రేయస్కరం.

మకరం: ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. అధిక అలసటకు గురికాకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. చంద్రశేఖర అష్టకం పఠనం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.

కుంభం: ఒక ముఖ్యమైన వ్యవహారంలో డబ్బు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతారు. గృహ సంబంధ పనుల్లో పురోగతి ఉంటుంది. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

మీనం: పనుల్లో శ్రమ, ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు పాటించడం ద్వారా కీలక సమస్యలను పరిష్కరించగలుగుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

ట్యాగ్లు
నేటి రాశిఫలాలుదిన రాశిఫలాలుజ్యోతిష్యంరాశులుమేషంవృషభంమిథునంకర్కాటకంసింహంకన్యతులవృశ్చికంధనుస్సుమకరంకుంభంమీనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!