
సినిమాలు

వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న ఒక్కరోజే 75,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!