
క్రీడలు

పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. నిన్న రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరపగా, చంద్రనాథ్ కారులోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా దేశంలోకి వచ్చిన ఆస్ట్రియా తయారీ పిస్టోల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఆయుధాన్ని బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. కోల్కతా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమై ఉండగా, ఈ కేసులో అంతర్జాతీయ అక్రమ ఆయుధాల కోణంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!