

హైదరాబాద్‌లో జరిగిన చారిత్రాత్మక “TG20 ఒరిజిన్స్” ఈవెంట్‌లో తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్ అయిన TG20 కోసం గవర్నింగ్ కౌన్సిల్ ఫౌండింగ్ ఫ్రాంచైజీ యజమానులను అధికారికంగా ప్రకటించింది. ఐటీసీ కాకతీయలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, హెచ్‌సీఏ అధికారులు, క్రికెట్ నిర్వాహకులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎనిమిది జట్లతో ప్రారంభమవుతున్న ఈ లీగ్ రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, గ్రాస్‌రూట్ క్రికెట్‌ను బలోపేతం చేయడం టీజీ20 ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు.
లీగ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జియోస్టార్‌తో ప్రసార ఒప్పందాలు, స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ప్రత్యక్ష ప్రసారాలు, జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మారియట్ హోటల్స్ హోస్టింగ్ భాగస్వామిగా ఉండగా, టీసీఎం స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా నియమితమైంది. లీగ్ నిర్వహణకు మాజీ టీఎన్‌పీఎల్ సీఈఓ ప్రసన్న కన్నన్‌ను నియమించారు. ఫ్రాంచైజీ యజమానులు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల నుంచి ఎంపికయ్యారు. టీజీ20 ద్వారా తెలంగాణ క్రికెట్‌కు కొత్త గుర్తింపు, వాణిజ్య అవకాశాలు, యువ ప్రతిభకు వేదిక లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!