
జనరల్

వియత్నాంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన తీవ్ర విషాదకరమని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.
తమిళనాడుకు చెందిన బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!