

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందుతున్న ఫేక్ కంటెంట్‌పై ఇటీవల ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, మాధురీ దీక్షిత్, ఊర్వశి రౌతేలా ఉన్నట్లుగా రూపొందించిన ఓ AI ఫొటో వైరల్‌గా మారింది. హీరోయిన్ల మధ్య హోదాలను చూపించేలా, ఊర్వశిని అవమానించే విధంగా ఈ ఫొటో ఉండటంతో చర్చ మొదలైంది.
ఈ ఫొటోపై ఊర్వశి రౌతేలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ఇండస్ట్రీలో ప్రతి నటికీ తనదైన ప్రయాణం, కష్టం, అదృష్టం, ప్రతిభ ఉంటాయని ఆమె పేర్కొన్నారు. మహిళలను ఒకరితో ఒకరిని పోల్చడం, అభిమానుల మధ్య గొడవలు సృష్టించడం వల్ల నెగెటివిటీ మాత్రమే పెరుగుతుందని అన్నారు. ఒకరినొకరు తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి ప్రతిభను, ఎదుగుదలను గౌరవించాలని కోరారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న ఇలాంటి విషపూరిత ధోరణిని ఆపాలని ఆమె చేసిన విజ్ఞప్తికి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!