
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద క్యూ కట్టాల్సి వచ్చింది. స్కానర్లు సరిగా పనిచేయకపోవడంతో కొంత సమయం పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల మెట్రో సిబ్బంది కూడా సమస్యను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే మెట్రో రైళ్లలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని L&T మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని, స్టేషన్లలో కూడా ఎలాంటి ప్రధాన ఇబ్బంది లేదని తెలిపారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు కొంత ఆలస్యంగా తెరుచుకున్నాయని అధికారులు వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!