
జనరల్

నార్త్ కొరియా నుంచి రహస్యంగా బయటకు తీసుకువచ్చిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై బీబీసీ నిర్వహించిన పరిశీలనలో ఆ దేశంలో కొనసాగుతున్న డిజిటల్ నిఘాపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ వినియోగిస్తున్న సమయంలో ప్రతి ఐదు నిమిషాలకు ఆటోమేటిక్‌గా స్క్రీన్‌షాట్ తీసుకునేలా రూపొందించినట్లు గుర్తించారు. యూజర్‌కు తెలియకుండానే తీసిన ఈ చిత్రాలను రహస్యమైన, ఎన్‌క్రిప్టెడ్ ఫోల్డర్‌లో భద్రపరుస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
ఈ స్క్రీన్‌షాట్‌లను యూజర్లు స్వయంగా తొలగించలేరని కూడా తేలింది. అధికారులు ఫోన్‌ను తనిఖీ చేసే సమయంలో పౌరులు ఏం చూస్తున్నారు, ఏం టైప్ చేస్తున్నారు వంటి వివరాలను పరిశీలించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడే అవకాశం ఉందని సమాచారం. ఈ వివరాలు నార్త్ కొరియాలో స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ కార్యకలాపాలపై ఉన్న కఠిన నియంత్రణలు, నిఘాపై మరోసారి ఆందోళనలను పెంచుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!