

తెలంగాణ విద్యుత్ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. సెప్టెంబర్ 30, 2026న రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరగా, విద్యుత్ సంస్థలు దాన్ని విజయవంతంగా తీర్చాయి. అదే రోజు టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 12,299 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ను సరఫరా చేయడంతో పాటు 223.34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థలు కృషి చేస్తున్నాయి.
ఈ సందర్భంగా టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంతో ఇంజినీర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి వల్లే కొత్త రికార్డులు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత అధిక డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాల బలోపేతం, సబ్‌స్టేషన్ల సామర్థ్య పెంపు, నెట్‌వర్క్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!