
జనరల్

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జూన్ 28 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,43,17,635 గణన ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో లక్ష్యంగా పెట్టుకున్న కుటుంబాలు, అర్హులైన ఓటర్లలో 42.33 శాతం మందిని ఈ ప్రక్రియ కవర్ చేసింది.
ఓటరు వివరాలను నవీకరించి, ధృవీకరించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు ప్రజలు సహకరించి అవసరమైన వివరాలను అందించాలని, తద్వారా భవిష్యత్ ఎన్నికలకు ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధమవుతుందని అధికారులు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!