

అమెరికా–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు మరియు విదేశీ మారకద్రవ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. తాను కూడా తన కాన్వాయ్‌లో వాహనాల వినియోగాన్ని ఇప్పటికే తగ్గించానని, ఇకపై మరింతగా తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేశ కరెన్సీ విలువను కాపాడటానికి విదేశీ మారకద్రవ్య వినియోగాన్ని నియంత్రించడం అవసరమని గవర్నర్ అన్నారు.
ప్రభుత్వ శాఖలు, రాజకీయ నాయకులు కూడా అవసరానికి మించి వాహనాల వినియోగాన్ని తగ్గించాలని గవర్నర్ సూచించారు. అలాగే తెలంగాణలో “నషా ముక్త తెలంగాణ” లక్ష్యంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కళాశాలలలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ప్రతిజ్ఞను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!