

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ధాన్యం తీసుకుని, అందుకు అనుగుణంగా బియ్యం అందించకుండా బకాయిలు పెండింగ్‌లో ఉంచిన మిల్లర్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే సుమారు రూ.98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్‌పర్సన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు మహాదేవ ఇండస్ట్రీలో తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ, యాసంగి సీజన్లలో ధాన్యం తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదని, 2024లోనూ ధాన్యం తీసుకుని బియ్యం సరఫరా చేయలేదని అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!