
జనరల్

జల జీవన్ మిషన్ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. మెడలో ప్లకార్డులు ధరించి పవన్ కళ్యాణ్ స్పందించాలని నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు నిరసన కొనసాగింది.
పెండింగ్ బకాయిలను సెప్టెంబర్ 20లోగా మూడు విడతల్లో చెల్లిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీ మేరకు బిల్లులు చెల్లిస్తే తమకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని వారు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!