
సినిమాలు

దేశీయ ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా త్వరలో విడుదల కానున్న టాటా సియెర్రా ఈవీ ఎస్‌యూవీలో ఇన్‌బిల్ట్ 5జీ సెల్యులార్ కనెక్టివిటీని అందించనున్నారు.
టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన మూవ్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను సియెర్రా ఈవీ ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్ ఎన్‌ఐఓతో అనుసంధానించనున్నారు. దీంతో వాహనంలో నిరంతరాయమైన కనెక్టివిటీతో పాటు కంటెంట్ స్ట్రీమింగ్, రియల్‌టైమ్ రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!