
బిజినెస్

తెలంగాణలోని కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు ఉన్నట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!