

‘KGF’ తర్వాత యశ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన పలువురు యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలను ప్రశంసిస్తుండగా.. మరికొందరు కథ, నేరేషన్, ఎడిటింగ్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు అడల్ట్ కంటెంట్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘టాక్సిక్’పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక నెగిటివ్ రివ్యూలపై యశ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ‘టాక్సిక్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అధికారిక సర్టిఫికేషన్ వివరాల్లోనూ ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ కథగా పేర్కొంటూ.. విధేయత, నైతిక సంఘర్షణలు, బ్రూటల్ యాక్షన్, హింస, విముక్తి వంటి అంశాలు ఉన్నట్లు వివరించారు. అందువల్ల సినిమాలో హింస, అడల్ట్ థీమ్స్ ఉండటం ముందుగానే స్పష్టమైందని, వాటినే ప్రధాన కారణంగా చూపిస్తూ సినిమాను పూర్తిగా నెగిటివ్‌గా చూడటం సరైనది కాదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
“ఇది క్యూట్ లవ్ స్టోరీ కాదు.. డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామా” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే మరోవైపు కథనం, పేసింగ్, ఎడిటింగ్, భావోద్వేగ కనెక్ట్ వంటి అంశాలపై వస్తున్న విమర్శలను కూడా సినిమా రివ్యూలలో ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ‘టాక్సిక్’పై పూర్తి తీర్పు ప్రేక్షకుల మౌత్ టాక్‌పై ఆధారపడి ఉండనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!