

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమృద్ధి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. అయితే, ఈసారి ఏ సైనిక కేంద్రంలో పండుగ జరుపుకోనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. దేశమంతా దీపాల కాంతులతో వెలిగిపోవడం చీకటిని తొలగించాలనే సంకల్పాన్ని సూచిస్తుందని తెలిపారు.
శనివారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విలువలతో ప్రేరణ పొందిన దేశభక్తి గల యువత వికసిత్ భారత్ నిర్మాణంలో చురుగ్గా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!