
టెక్నాలజీ

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మన్యం శ్రీనివాస్‌ను నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు.
ఈ నియామకంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జే.బి. శ్రీనివాస్ (మన్యం శ్రీనివాస్) నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుపతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, పార్టీ అధిష్ఠానం తదుపరి పరిణామాలపై దృష్టి సారించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!