

ఫిఫా వరల్డ్‌కప్ మధ్యలో రిటైర్మెంట్‌పై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోనని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో స్పష్టం చేశారు. క్రొయేషియాపై 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన పూర్తి దృష్టి టోర్నమెంట్‌పైనే ఉందని, పోర్చుగల్ ప్రయాణం ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన సోదరి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. అలాగే క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిచ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, అతను ఎప్పటికీ ఒక లెజెండ్ అని కొనియాడారు. రియల్ మాడ్రిడ్ తరఫున కలిసి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ, అతనితో మళ్లీ మైదానాన్ని పంచుకోవడం ఎప్పుడూ ఆనందమేనని అన్నారు.
ఈ మ్యాచ్‌లో రోనాల్డో మరో చారిత్రాత్మక రికార్డు నెలకొల్పారు. 41 సంవత్సరాల 147 రోజుల వయసులో ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచారు. అలాగే తన కెరీర్‌లో ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న రోనాల్డోకు నాకౌట్ దశలో ఇదే తొలి గోల్ కావడం విశేషం. అద్భుత ప్రదర్శనకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలుత ఇవాన్ పెరిసిచ్ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యంలోకి వెళ్లగా, VAR సమీక్ష తర్వాత లభించిన పెనాల్టీని రోనాల్డో గోల్‌గా మలిచారు. చివర్లో గోన్సాలో రామోస్ చేసిన గోల్‌తో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌తో తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!