

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆరు ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్పత్తులను "ఎనర్జీ డ్రింక్స్"గా ప్రచారం చేస్తూ తప్పుడు లేబులింగ్ ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు FSSAI వెల్లడించింది. సంబంధిత కంపెనీల నుంచి దీనిపై వివరణ కోరినట్లు తెలిపింది.
నోటీసులు అందుకున్న బ్రాండ్‌లలో రెడ్ బుల్, పెప్సికో అడ్రెనలిన్ రష్, కాంపా గోల్డ్‌బూస్ట్, స్టింగ్, హెల్ ఎనర్జీ, కోకాకోలా మాన్‌స్టర్ ఎనర్జీ ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక ప్రమాణాలను నిర్దేశించలేదని FSSAI స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉత్పత్తుల లేబులింగ్ చేయరాదని హెచ్చరించింది. కంపెనీల నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!