

ఆంధ్రప్రదేశ్లో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశముందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో తవ్వకాలు కొనసాగుతుండగా, ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా అన్వేషణ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో తవ్వకాల ప్రక్రియను జీ-1, జీ-2, జీ-3, జీ-4 దశలుగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి నిధి ఎన్ఎంఇటి సహకారంతో ఈ పనులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తవ్వకాల ద్వారా నిక్షేపాల పరిమాణం, నాణ్యతపై స్పష్టత వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఖనిజ రంగ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!