
సినిమాలు

థాయ్‌లాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది బౌద్ధ సాధువులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న సాధువుల బృందంపై అదుపుతప్పిన పికప్ ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 13 మంది సాధువులు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. పికప్ ట్రక్కును 11 ఏళ్ల బాలుడు నడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఘటన అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!