
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పంపిన లేఖలో, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించకుండానే పంపిణీ చేసినట్లు తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపించారు.
జూలై 1 నాటికి డిజిటలైజేషన్ ప్రక్రియ కేవలం 30.90 శాతం మాత్రమే పూర్తయిందని, కడప, అనంతపురం అర్బన్, విజయవాడ వెస్ట్ వంటి పలు నియోజకవర్గాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల జాబితాను పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని వైఎస్సార్సీపీ కోరింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!