

జపాన్ ప్రధాని సనాయె తకాయిచి భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు గౌరవ విందు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ఆమెను సంతూర్ వాయిద్యాన్ని వాయించాలని కోరగా, మొదట సంకోచించిన తకాయిచి మోదీ సూచనలతో ఆ వాయిద్యాన్ని సరదాగా వాయించారు. ఈ సందర్భాన్ని మోదీ సోషల్ మీడియాలో పంచుకోగా, అది విస్తృతంగా ఆకర్షించింది.
సమావేశం అనంతరం మోదీ ఆమెను తన “చిట్టి చెల్లి”గా అభివర్ణిస్తూ జపాన్ భారత అభివృద్ధిలో కీలక భాగస్వామి అని అన్నారు. తకాయిచి కూడా ఈ ఆత్మీయతపై ఆనందం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ఆర్థిక భాగస్వామ్య చట్టం, రక్షణ రంగంలో సంయుక్త అభివృద్ధి వంటి అంశాలపై అంగీకరించాయి. కృత్రిమ మేధ, ఇంధన సరఫరా, నౌకా నిర్మాణం, విమానయానం, లాజిస్టిక్స్ రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!