
క్రీడలు

పశ్చిమ బెంగాల్లో తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాథ్ హత్యపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఇది ముందుగానే పథకం వేసి చేసిన హత్య అని ఆయన పేర్కొన్నారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీని తాను ఓడించిన కారణంగానే తన పీఏను లక్ష్యంగా చేసుకుని హత్య చేశారని ఆయన ఆరోపించారు.
రాథ్పై నాలుగు బుల్లెట్లు కాల్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని సువేందు తెలిపారు. ఇది సాధారణ నేరం కాదని, కిరాయి హంతకులతో చేసిన ప్రణాళికాబద్ధమైన హత్య అని ఆయన అన్నారు. ఘటనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసులు ఆధారాలను సేకరించి అనుమానితులను గుర్తిస్తున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!