

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పార్క్ చుట్టూ అండర్‌పాస్ నిర్మాణ పనులను చేపడుతున్న నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తదుపరి విచారణ వరకు పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి కీలక వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తోందని, హైకోర్టు సెలవులను అదనుగా తీసుకుని చెట్ల నరికివేత కొనసాగిస్తోందని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. కేబీఆర్ పార్క్ పరిసరాల పచ్చదనం, జీవ వైవిధ్య పరిరక్షణపై పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపశమనంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!