

విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను హోంమంత్రి వంగలపూడి అనిత నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్, డీఐజీ, సీపీ, మత్స్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యల పురోగతిపై ఆరా తీస్తున్నారు.
గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి, నేవీ హెలికాప్టర్ మరియు మెరైన్ బోట్లు ద్వారా విస్తృతంగా శోధన కొనసాగించాలని సూచించారు. బాధిత మత్స్యకారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు పూర్తి అండగా నిలవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన అనిత, గల్లంతైన వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!