
బిజినెస్

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీహిల్స్‌లోని బండ్ల గణేష్‌కు చెందిన ఆస్తిని ₹8.50 కోట్లకు వేలం వేసింది. ఈ వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన కేసులో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) గతంలో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
డీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు, డీఆర్టీ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ బ్యాంక్ నిర్వహించిన ఆస్తుల వేలం చట్టబద్ధమేనని తీర్పు వెలువరించింది. దీంతో ఆస్తుల వేలం విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుకూలంగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!